Telugu Global
Cinema & Entertainment

కొండారెడ్డి బురుజుపై బాలయ్య సినిమా టైటిల్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా టైటిల్ ను కొండారెడ్డి బురుజు పై ఆవిష్కరిస్తారు.

కొండారెడ్డి బురుజుపై బాలయ్య సినిమా టైటిల్
X

కొండారెడ్డి బురుజుపై బాలయ్య సినిమా టైటిల్ కొత్త సినిమా టైటిల్ ప్రకటనపై పూర్తి క్లారిటీ వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఈనెల 21న ఆ టైటిల్ ను ప్రకటిస్తారనే విషయాన్ని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. ఇప్పుడీ కార్యక్రమానికి ఓ ప్రత్యేక వేదికను కూడా ఖరారు చేశారు.


బాలయ్య కొత్త సినిమా టైటిల్ ను కర్నూలులోని కొండారెడ్డి బురుజుపైన ఆవిష్కరించబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. కొండారెడ్డి బురుజుపై ఓ సినిమా టైటిల్ ను ఆవిష్కరించడం ఇదే తొలిసారి.


బాలయ్యతో గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంటివి వచ్చేశాయి. సో.. టైటిల్ రిలీజ్ కార్యక్రమానికి సీమను వేదికగా చేసుకుంటే బాగుంటుందని భావించారు. అందుకే కొండారెడ్డి బురుజును ఎంపిక చేశారు.


నిజానికి ఈ కార్యక్రమాన్ని తన నియోజకవర్గం హిందూపురంలో ఏర్పాటుచేయాలని అనుకున్నారు బాలయ్య. అయితే కొండారెడ్డి బురుజు అయితే మరింత క్రేజీగా ఉంటుందని ఈ లొకేషన్ ఫిక్స్ చేశారు. ఇదే సినిమాకు సంబంధించి మరో వేదికను హిందూపురం లేదా తిరుపతిలో ఏర్పాటుచేసే అవకాశం ఉంది.

First Published:  19 Oct 2022 12:02 PM GMT
Next Story