Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ప్రకటన అప్పుడే..?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. షూటింగ్ అయితే జోరుగా సాగుతోంది కానీ, ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. దసరాకు టైటిల్ రిలీజ్ చేస్తారేమో!

బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ప్రకటన అప్పుడే..?
X

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికైతే 'పెద్దాయన' , 'అన్నగారు' , 'జై బాలయ్య' లాంటి టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఫైనల్ గా 'జై బాలయ్య' అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్.

కానీ మేకర్స్ మాత్రం టైటిల్ పై ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అక్టోబర్ లో దసరా స్పెషల్ గా ఓ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. ఆ టీజర్ లోనే సినిమా టైటిల్ చెబుతారనే టాక్ వినిపిస్తోంది. సో.. ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేశారనేది తెలియాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ , టీజర్ రిలీజయ్యాయి. మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.

First Published:  17 Sep 2022 7:05 AM GMT
Next Story