Telugu Global
Cinema & Entertainment

Balakrishna: ఏఎన్నార్ పై మరో వివాదం రేపిన బాలకృష్ణ

Balakrishna controversy - అక్కినేని-తొక్కనేని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలయ్య, ఇప్పుడు అదే కోణంలో మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

Akkineni fans and Netizens fire on Balakrishna in social media
X

బాలకృష్ణ

అక్కినేనిని తొక్కనేని అంటూ తన నోటిదురద చూపించుకున్న బాలకృష్ణ.. ఆ వెంటనే నష్టనివారణ చర్యల కోసం తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. జరిగిన తప్పుపై ప్రెస్ నోట్ రిలీజ్ చేయకుండా, ఏదైనా సందర్భంలో దాన్ని కవర్ చేసుకోవాలని బాలయ్య డిసైడ్ అయ్యాడు.

మొత్తానికి ఆ టైమ్ రానే వచ్చింది. మరోసారి మీడియా ముందుకొచ్చారు బాలయ్య. అక్కినేనిపై తనకున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో మరోసారి అక్కినేని నాగేశ్వరరావును ఆయన కించపరచడం బాధాకరం.

Advertisement

ఎన్టీఆర్ ను చాలామంది ఎన్టీవోడు అనడం తెలిసిందే. అదే విధంగా ఏఎన్నార్ ను కూడా చాలామంది 'నాగి గాడు' అని అంటారంట. అలా తనుకూడా ఏఎన్నార్ పై అభిమానంతో అక్కినేని-తొక్కనేని అన్నానంటూ బాలకృష్ణ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇంకా ఏమన్నారంటే..

"ఎన్టీఆర్ ను ఎన్టీవోడు అంటారు, నాగేశ్వరరావును నాగి గాడు అంటారు. అభిమానంతో అలా అంటారు. నేను ప్రచారానికి వెళ్లినప్పుడు నన్ను కూడా ఏదో ఒక మాట అంటారు. వాళ్ల ప్రాంతం, వాళ్ల యాస, వాళ్ల పిచ్చి అది. అలాగే నాకు ఆప్తులైన వాళ్లను నేను అలానే పిలుచుకుంటాను."

Advertisement

ఇలా తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు బాలయ్య. తాడో-పేడో అనే పదప్రయోగం ఉందని, అందులో పేడో అంటే అర్థం ఉండదని.. అలానే అక్కినేని-తొక్కినేని అంటూ తను ఫ్లోలో అన్నానంటూ సమర్థించుకున్నారు. నాగేశ్వరరావు కు వాళ్ల పిల్లల కంటే తను అంటేనే ఎక్కువ ఇష్టమంటూ మరో కొత్త వివాదం రేపారు.

"నాగేశ్వరరావు బాబాయ్ కు నేనంటే చాలా ఇష్టం. తన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమతో నన్ను చూసుకునేవాళ్లు. ప్రేమగా పలకరించేవారు. ఎందుకంటే, ఆప్యాయత అక్కడ లేదు. ఇక్కడుంది."

ఇలా నాగార్జున ఇంట్లో నాగేశ్వరరావుకు ఆప్యాయత దక్కలేదనే అర్థంవచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలయ్య. ఏఎన్నార్ అంటే తనకు ఎప్పుడూ ఆప్యాయత ఉందన్నారు. ఇలా ఒక వివాదాన్ని కవర్ చేయబోతూ, కొనసాగుతున్న వివాదాన్ని మరింత జటిలం చేశారు బాలకృష్ణ. ఇలా మీడియా ముందుకొచ్చి మాట్లాడేకంటే, సైలెంట్ ఉంటే సరిపోయేదేమో.

Next Story