Telugu Global
Cinema & Entertainment

Balakrishna Boyapati | బ్లాక్ బస్టర్ కాంబో కలిసింది

Balakrishna Boyapati - బాలకృష్ణ-బోయపాటి మరోసారి చేతులు కలిపారు. నాలుగో సినిమా చేస్తున్నారు.

Balakrishna Boyapati | బ్లాక్ బస్టర్ కాంబో కలిసింది
X

నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను పూర్తి చేసి ఇండియన్ సినిమా క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత ఈ కాంబో మళ్లీ చేతులు కలిపింది.

వీరిద్దరూ నాలుగోసారి జత కడుతున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో చిత్రాన్ని, ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 'లెజెండ్' సినిమా నిర్మాణ భాగస్వాములైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి ఈ చిత్రానికి ప్రజెంటర్.

బాలకృష్ణ, బోయపాటి తెలుగు సినిమాలో బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారు. ఈ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ హై బడ్జెట్, టాప్ క్లాస్ టెక్నికల్ వాల్యూస్ తో వస్తోంది.

ప్రస్తుతం బాబి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇంకా పేరు పెట్టని ఆ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు.

First Published:  10 Jun 2024 5:45 PM GMT
Next Story