Telugu Global
Cinema & Entertainment

Balakrishna | కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసిన బాలయ్య

Balakrishna - బాబి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Balakrishna | కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసిన బాలయ్య
X

వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. కెరీర్ లో ఆయనకు ఇది 109వ చిత్రం. వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన బాబి, బాలయ్యతో మరో యాక్షన్ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో కూడా యాక్షన్ అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు.

యాక్షన్ సీక్వెన్స్‌ తో రూపొందించిన గ్లింప్స్ లో బాలకృష్ణ ను దర్శకుడు బాబీ, యాక్షన్ లుక్ లో చూపించాడు. కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తూనే తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టారు బాలయ్య.

ఈ సినిమాలో బాలకృష్ణ కూల్ గా కనిపిస్తూనే, క్రూరంగా కూడా వ్యవహరిస్తాడని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. గ్లింప్స్ అలానే ఉంది. గూండాలు తన వైపు పరుగెత్తుకుంటూ వస్తుంటే, బాలయ్య కూల్ గా మద్యం తాగడాన్ని గ్లింప్స్ లో చూపించారు. ఇక ఈ గ్లింప్స్ ను "కల్ట్ సరుకు" అని పిలుస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. బాలకృష్ణ-బాబీ డియోల్ మధ్య అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలుంటాయంట. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే వెల్లడిస్తారు.


First Published:  9 March 2024 4:54 AM GMT
Next Story