Telugu Global
Cinema & Entertainment

Balakrishna: బాలయ్య-అనీల్ రావిపూడి మూవీ షెడ్యూల్ పూర్తి

Balakrishna: అనీల్ రావిపూడితో చేస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశాడు బాలయ్య. అదే సెట్ లో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేశాడు.

Balakrishna: బాలయ్య-అనీల్ రావిపూడి మూవీ షెడ్యూల్ పూర్తి
X

బాలకృష్ణ, అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేసిన భారీ జైలు సెట్‌లో అంతే భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో తాజాగా టీమ్ మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కి వెంకట్‌ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

ఈ షెడ్యూల్‌ లో బాలకృష్ణ, శరత్ కుమార్ తో పాటు మరికొందరు ఆర్టిస్టులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ సెట్ లోనే యూనిట్ తరఫున నూతన సంవత్సర వేడుకలని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ రెండూ ఉండబోతున్నాయి. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.




First Published:  31 Dec 2022 3:54 PM GMT
Next Story