Telugu Global
Cinema & Entertainment

Balakrishna: కొత్త సినిమా లాంఛ్ చేసిన బాలయ్య

Balakrishna - బాలకృష్ణ, అనీల్ రావిపూడి కాంబో లో కొత్త సినిమా ఈ రోజు ఉదయం లాంచ్ అయింది.

Balakrishna:  కొత్త సినిమా లాంఛ్ చేసిన బాలయ్య
X

బా ల కృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా మొదలైంది. బాలయ్య కెరీర్ లో 108 వ చిత్రంగా ఇది రాబతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది.


ముహూర్తం షాట్‌కు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, కిలారు సతీష్, శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.


ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే మొదలైంది. యాక్షన్ బ్లాక్ తో షూట్ స్టార్ట్ చేశారు. ఈ యాక్షన్ బ్లాక్ కి వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫర్ కాగా, రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్.


బాలకృష్ణ మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నారు. సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల, బాలయ్య సరసన హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ కనిపించనున్నారు. తమన్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా సిద్ధమౌతుంది.

First Published:  8 Dec 2022 9:22 AM GMT
Next Story