Telugu Global
Cinema & Entertainment

Balakrishna: వాలంటైన్స్ డే తేదీ మార్చాలి - బాలకృష్ణ

Balakrishna: ప్రేమికుల రోజు తేదీ మార్చాలి అంటున్నారు బాలకృష్ణ. ఎందుకో చూద్దాం

Balakrishna: వాలంటైన్స్ డే తేదీ మార్చాలి - బాలకృష్ణ
X

ప్రేమికుల రోజు తేదీ మార్చాలంటున్నారు బాలయ్య. ఊర్వశివో రాక్షసివో సినిమా ట్రయిలర్ చూసిన తర్వాత ఆయన ఈ అభిప్రాయానికొచ్చారు. ఈ సినిమాను రిలీజ్ చేసిన రోజున, ప్రజలంతా ప్రేమికుల రోజు జరుపుకోవాలని, ట్రయిలర్ అంత బాగుందన్నారు.


"ప్రస్తుతం యూత్ అభిరుచులు మారుతున్నాయి.. సహజీవనం, ఎఫైర్స్ అనేవి నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేలా దర్శక, నిర్మాతలు కృషి చేయాలి. అల్లు శిరీష్, అను సినిమాకు తగ్గట్టు చాలా బాగా యాక్టింగ్ చేశారు. దర్శకుడు తీసిన విధానం బాగుంది. హీరో హీరోయిన్ లా నుండి అద్భుతమైన నటనను రాబాట్టుకున్నాడు. ఊర్వశివో రాక్షసివో సినిమా ట్రైలర్ చూస్తుంటే కొత్తగా అందంగా కలర్ ఫుల్ గా రొమాంటిక్ గా కనిపిస్తుంది. అందుకే ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అయితే దాన్ని నవంబర్ 4 కు మార్చాల్సి వస్తుందేమో అనిపించింది."


అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా 'విజేత' సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో జీఏ-2 పిక్చర్స్‌ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా "ఉర్వశివో రాక్షసివో". అనూప్‌ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని దర్శకుడు.


నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ వేదికపై ప్రసంగిస్తూ, ఇలా సినిమాను ఆకాశానికెత్తేశారు.

First Published:  31 Oct 2022 11:25 AM GMT
Next Story