Telugu Global
Cinema & Entertainment

''షోలకే అమ్మ మొగుడు నా షో''... బాబుతో బాలకృష్ణ షో

అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని.. దేశంలోనే ఇలాంటి షోలకు అమ్మ మొగుడు అన్నట్టుగా తన షో నిలిచిందని బాల‌కృష్ణ అన్నారు.

షోలకే అమ్మ మొగుడు నా షో... బాబుతో బాలకృష్ణ షో
X

ఆహా ఓటీటీలో బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్‌ ప్రారంభం కాబోతోంది. రెండో సీజన్ మొదటి షో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో ప్రారంభం కాబోతోంది. రెండో సీజన్ ప్రారంభం సందర్భంగా విజయవాడలో ఈవెంట్ నిర్వహించారు. అక్కడే సెట్ వేశారు. చంద్రబాబునాయుడిని అతిథిగా తీసుకొచ్చారు. ఈ షో ద్వారా చంద్రబాబును మరింత ప్రమోట్ చేయబోతున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. మొదటి సీజన్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని.. దేశంలోనే ఇలాంటి షోలకు అమ్మ మొగుడు అన్నట్టుగా తన షో నిలిచిందన్నారు. జనంలో రెండో సీజన్‌పైనా భారీ అంచనాలు ఉన్నాయన్నారు.

చంద్రబాబుతో షో చేయడం ఎంతో ఆనందంగా ఉందని... కొత్తగా వినూత్నంగా చేశామన్నారు. ఏపీకి మళ్లీ ముఖ్యమంత్రిగా రావాల్సిన చంద్రబాబుతో ఈ షో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల్లో చంద్రబాబు తప్ప మరెవరూ ఈ షోలో పాల్గొనబోరని బాలకృష్ణ చెప్పారు.

First Published:  4 Oct 2022 2:20 PM GMT
Next Story