Telugu Global
Cinema & Entertainment

Bahumukham Movie | హాలీవుడ్ రేంజ్ లో 'బహుముఖం'

Bahumukham - పూర్తిగా కొత్త నటీనటులతో విదేశాల్లో తెరకెక్కించిన సినిమా బహుముఖం. ఈ సినిమా టీజర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది.

Bahumukham Movie | హాలీవుడ్ రేంజ్ లో బహుముఖం
X

హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం బహుముఖం. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్ జార్జియా, యూఎస్ఎ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈరోజు చిత్ర టీజర్‌ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

నిర్బంధ కేంద్రంలో కొన్నేళ్ళు గడిపిన తర్వాత, తన్వీర్ తన కౌన్సెలింగ్ సెషన్‌లలో భాగంగా ప్రతి నెలా సైకోథెరపిస్ట్ దిశను కలుస్తాడు. నటుడిగా తన, తన తల్లి కలను కొనసాగించడానికి ఆమె నుండి సహాయం కోరతాడు. అయినప్పటికీ, తన చుట్టూ ఉన్న వ్యక్తులకు ముప్పు కలిగించే టెర్రిఫిక్ సీక్రెట్స్ తనకి తెలుసు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఊహించని మలుపులు ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయంటోంది యూనిట్.

టీజర్‌ని బట్టి చూస్తే సినిమాకు బహుముఖం అనే టైటిల్‌ కరెక్ట్ గా సరిపోయింది. ఈ వీడియో హీరోకు చెందిన వివిధ షేడ్స్ చూపిస్తుంది. హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నాడు. అతను రచన, దర్శకత్వంతో సహా ఇతర విభాగాలను కూడా చక్కగా నిర్వహించాడు. స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా తమ పాత్రలలో రాణించారు.

ల్యూక్ ఫ్లెచర్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ఎసెట్. క్రిస్టల్ మౌంటైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి అరవింద్ రెడ్డి సహ నిర్మాత. రామస్వామి, హర్షివ్ కార్తీక్ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీత దర్శకుడు. గ్యారీ బిహెచ్‌తో పాటు ఎడిటింగ్ కూడా చూసుకున్నాడు హర్షివ్ కార్తీక్. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

First Published:  24 Feb 2024 4:22 PM GMT
Next Story