Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్

ఇటీవల ఆదిపురుష్ గ్రాఫిక్ వర్క్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సలార్ పై కూడా అలా విమర్శలు రాకుండా ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్. రాజీపడకుండా ఫైనల్ అవుట్ పుట్ బాగా వచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందుకే సినిమా విడుదల ఆలస్యమవుతోంది.

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్
X

హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. సలార్ సినిమా వాయిదాపై హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ట్వీట్ వేసింది. సినిమా వాయిదా పడినట్టు అనధికారిక సమాచారం ఇప్పటి వరకు ఉన్నా, నిర్మాణ సంస్థ ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది. ఫైనల్ రిలీజ్ డేట్ పై చిన్న హింట్ కూడా ఇవ్వకపోవడం ఇందులో మరో విశేషం. ఇంతకీ సలార్ ఈ ఏడాది వస్తుందా రాదా అనేది తేలాల్సి ఉంది.

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది సలార్. సెప్టెంబర్-28న పాన్ ఇండియా లెవల్ లో సినిమా విడుదల అంటూ గతంలోనే ప్రకటించారు దర్శక నిర్మాతలు. విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ప్రారంభమయ్యాయి. రికార్డ్ లు బ్రేక్ చేశాయి. కానీ అంతలోనే నిర్మాతలిచ్చిన సమాచారంతో విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆపేశారు, టికెట్ డబ్బులు వెనక్కు ఇచ్చేశారు. దీంతో సినిమా వాయిదా కన్ఫామ్ అయింది. ఇప్పుడు నిర్మాణ సంస్థ అధికారికంగా ట్వీట్ వేసింది.


'సలార్‌పై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు సంతోషం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీకు అద్భుతమైన సినిమా అందివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాను మరింత బాగా తీర్చిదిద్దేందుకు మా టీమ్‌ అవిశ్రాంతంగా పని చేస్తోంది. సలార్‌ కు ఫైనల్‌ టచ్‌ ఇస్తున్నాం. కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం' అని హోంబలే ఫిలింస్‌ ట్వీట్‌ చేసింది.

ఆగిన గ్రాఫిక్స్ వర్క్స్..

సలార్ గ్రాఫిక్స్ వర్స్క్ ఇంకా పూర్తికాలేదని, అందుకే సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది. ఇటీవల ఆదిపురుష్ గ్రాఫిక్ వర్క్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సలార్ పై కూడా అలా విమర్శలు రాకుండా ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్. రాజీపడకుండా ఫైనల్ అవుట్ పుట్ బాగా వచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందుకే సినిమా విడుదల ఆలస్యమవుతోంది.

First Published:  13 Sep 2023 5:36 AM GMT
Next Story