Telugu Global
Cinema & Entertainment

Naa Saami Ranga - నాగ్ సినిమా నుంచి ఒకేసారి 2 అప్ డేట్స్

Naa Saami Ranga - నా సామిరంగ నుంచి ఒకేసారి 2 అప్ డేట్స్ వచ్చాయి. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూనే, పనిలోపనిగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Naa Saami Ranga - నాగ్ సినిమా నుంచి ఒకేసారి 2 అప్ డేట్స్
X

కింగ్ నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒకేరోజు 2 అప్ డేట్స్ ఇచ్చారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అదే టైమ్ లో సినిమా నుంచి టైటిల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.

ఆస్కార్ అవార్డ్ విజేతల ద్వయం- ఎంఎం కీరవాణి క్యాచీ ట్రాక్‌, చంద్రబోస్ మాస్ లిరిక్స్‌తో ఈ టైటిల్ సాంగ్ మెస్మరైజ్ చేసింది. ‘మా జోలికొస్తే.. మాకడ్డు వస్తే.. మామూలుగా ఉండదు.. నా సామిరంగ.. ఈ గీత తొక్కితే.. మా సేత సిక్కితే.. మాములుగా ఉండదు.. నా సామిరంగ’ అనే పదాలు హీరో పాత్రని తెలియజేస్తూ మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి.

ఈ పాటని కాల భైరవ & రాహుల్ సిప్లిగంజ్ హై ఎనర్జీతో ఆలపించారు. ప్రధాన తారాగణం తో పాటు 300 మంది డ్యాన్సర్స్ తో లావిష్‌గా చిత్రీకరించిన పాటకు దినేష్ మాస్టర్ అందించిన కొరియోగ్రాఫర్ ఎక్స్ ట్రార్డినరీ గా ఉంది. నాగార్జునతో కలిసి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ డ్యాన్స్ చేయడం ఈ సాంగ్ కు హైలెట్.

First Published:  31 Dec 2023 5:27 PM GMT
Next Story