Telugu Global
Cinema & Entertainment

Baby Movie - బేబీ మూవీ రిలీజ్ డేట్ లాక్

Baby Movie - ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం బేబీ. ఈ మూవీని వచ్చేనెల రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Baby Box Office Collection | బేబి మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌
X

Baby Box Office Collection | బేబి మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ. ఈమధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో బేబీ సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కే.ఎన్ నిర్మించాడు.

ఈ చిత్రంలోని కొన్ని పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను యూట్యూబ్‌ లో విపరీతంగా ఆకట్టుకున్నాయి. బేబి చిత్రానికి విజయ్ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు. ముందుగా ఈ సినిమా నుంచి ఓ రెండు మేఘాలిలా, దేవరాజ అని రెండు పాటలు విడుదలై మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి.

ఇక ఈమధ్య రష్మిక ఈ సినిమా నుంచి విడుదల చేసిన బ్రేకప్ సాంగ్ ‘ప్రేమిస్తున్నా’ అయితే యూత్ కి వెంటనే కనెక్ట్ అయిపోయి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నుంచి నాలుగవ పాట కూడా ఈ వారం లో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇలా టీజర్, పాటలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి హైప్ తెచ్చుకోవడమే కాకుండా విడుదల తేదీ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకుల ను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. ఎట్టకేలకు ఆ అప్ డేట్ కూడా వచ్చింది.

ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. వీటిని కూడా త్వరగా పూర్తి చేసుకొని జూలైలో అందరినీ అలరించడానికి సిద్ధమవుతుంది ఈ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే కచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  14 Jun 2023 4:31 PM GMT
Next Story