Telugu Global
Cinema & Entertainment

Baby Movie | పోస్టర్ వివాదంపై స్పందించిన బేబి నిర్మాత

Baby Movie - పోస్టర్ తో చెలరేగిన వివాదంపై బేబి మూవీ నిర్మాత స్పందించాడు. అది డిజైన్ లో లోపం అంటున్నాడు.

Baby Movie | పోస్టర్ వివాదంపై స్పందించిన బేబి నిర్మాత
X

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా బేబి. ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ఈమధ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. హీరోయిన్ ను అసభ్యంగా చూపిస్తూ డిజైన్ చేసిన పోస్టర్ అది. ఈ భారీ పోస్టర్ ను ఏకంగా ప్రసాద్ ఐమ్యాక్స్ గోడపై నుంచి ఆవిష్కరించారు. మిడిల్ ఫింగర్ పై హీరోయిన్ ను నిలబెట్టి క్రియేట్ చేసిన ఆ పోస్టర్ పై చాలా విమర్శలు చెలరేగాయి.

మంచి బజ్ తో కొనసాగుతున్న బేబి మూవీపై ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ వచ్చేసరికి నిర్మాత ఎస్.కే.ఎన్ వెంటనే అలర్ట్ అయ్యాడు. వివాదం మొదలైన వెంటనే ఆ పోస్టర్ ను, సదరు వీడియోను డిలీట్ చేశాడు. తాజాగా దానిపై స్పందించాడు.

"పోస్టర్ సరిగా కంపోజింగ్ అవ్వకపోవడంతో ట్విటర్‌లో డిలీట్ చేశా. ముందు వేరే పోస్టర్ అనుకున్నాం. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో వర్టికల్ పోస్టర్ అయితేనే ఆవిష్కరించగలమని అన్నారు. దీంతో ముందు అనుకున్న పోస్టర్ కాకుండా నిలువుగా ఉన్న పోస్టర్ డిజైన్ ను రిలీజ్ చేశాం. అయితే అది అనుకున్న విధంగా రాలేదు. దీంతో వెంటనే డిలీట్ చేశా."

ఇలా వివాదాస్పద పోస్టర్ పై స్పందించాడు ఎస్.కే.ఎన్. కేవలం డిజైనింగ్ లో లోపం వల్లనే అలా జరిగిందన్నాడు. నిజానికి చాలామంది ఆ పోస్టర్ వీడియోను డిలీట్ చేయొద్దన్నారని.. కానీ తనకు అలాంటి పబ్లిసిటీ అక్కర్లేదని, అందుకే వెంటనే డిలీట్ చేశానని తెలిపాడు.

తను కంటెంట్ ను నమ్ముతానని, కాంట్రవర్సీని నమ్మనని అంటున్న ఎస్.కే.ఎన్.. బేబి సాంగ్స్ ఇప్పటికే హిట్టయ్యాయని, తనకు ఆ ప్రచారం చాలని అంటున్నాడు. ఈనెల 14న థియేటర్లలోకి వస్తోంది బేబి.

First Published:  10 July 2023 1:36 AM GMT
Next Story