Telugu Global
Cinema & Entertainment

Santosh Sobhan | బేబి టీమ్ తో చేతులు కలిపిన సంతోష్ శోభన్

Santosh Sobhan | బేబి లాంటి కల్ట్ సినిమా తీసిన మేకర్స్ తో చేతులు కలిపాడు సంతోష్ శోభన్. ఈసారి హిట్ గ్యారెంటీ అంటున్నాడు.

Santosh Sobhan | బేబి టీమ్ తో చేతులు కలిపిన సంతోష్ శోభన్
X

Santosh Sobhan | బేబి టీమ్ తో చేతులు కలిపిన సంతోష్ శోభన్

Santosh Sobhan | బేబి ఘన విజయంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్. ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. యంగ్ హీరో సంతోష్ శోభన్, సోషల్ మీడియా ఫేమ్ అలేఖ్య హారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా లాంఛ్ అయింది.

హీరో నాగ చైతన్య క్లాప్ తో ఈ సినిమా మొదలైంది. డైరెక్టర్ హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ హీరో నాగ చైతన్యతో పాటు పలువురు స్టార్ డైరెక్టర్స్ హాజరయ్యారు. డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా..ఫస్ట్ షాట్ కు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించాడు. హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సాంకృత్యన్ మూవీ టీమ్ కు శుభాకాంక్షళు తెలియజేశారు.

అమృత ప్రొడక్షన్స్ లో కలర్ ఫొటో అనే సినిమా వచ్చింది. దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ ఇమేజ్ ను నిలబెట్టుకునే క్రమంలో మరో సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు మంచి కథ దొరికిందని, అందుకే అమృతా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా చేస్తున్నానని తెలిపారు నిర్మాతలు.

బేబి సినిమాకు అద్భుతమైన సంగీతం అందించిన విజయ్ బుల్గానిన్, ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. తన ప్రతి సినిమాలో తెలుగు హీరోయిన్లనే తీసుకుంటారు ఈ నిర్మాతలు. ఆ సంప్రదాయాన్ని ఈ సినిమాతో కూడా కొనసాగించారు.

First Published:  30 Oct 2023 5:14 PM GMT
Next Story