Telugu Global
Cinema & Entertainment

Baby Movie Collections | 50 కోట్ల క్లబ్ లో చేరిన చిన్న సినిమా

Baby Movie Box Office Collection | ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. తాజాగా రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరింది.

Baby Movie Collections | 50 కోట్ల క్లబ్ లో చేరిన చిన్న సినిమా
X

Baby Movie Collections | 50 కోట్ల క్లబ్ లో చేరిన చిన్న సినిమా

చిన్న సినిమాగా వచ్చిన బేబి సినిమా పెద్ద విజయాన్నందుకుంది. తాజాగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరింది. నిన్నటితో 8 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. నైజాంలో విడుదలైన 3 రోజులకే బ్రేక్ ఈవెన్ అవ్వగా, తాజాగా రిలీజైన అన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్ సాధించింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాను చాలా తక్కువ రేటుకు అమ్మేశారు. తాజాగా ఈ మూవీ అక్కడ హాఫ్-మిలియన్ (5 లక్షలు) డాలర్లు వసూళ్లు చేసింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సాయిరాజేష్ దర్శకత్వం వహించాడు. విరాజ్ అశ్విన్ సెకెండ్ హీరోగా కనిపించాడు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్ గా మారింది. మూవీకి రిలీజ్ కు ముందే హైప్ తీసుకొచ్చింది విజయ్ బుల్గానిన్ సంగీతం.

అలా ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన బేబి సినిమా, వారం రోజులు గడిచేసరికి బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఫైనర్ రన్ నాటికి ఈ సినిమా 65 కోట్ల రూపాయల గ్రాస్ సాధించే అవకాశం ఉందంటోంది ట్రేడ్.

First Published:  22 July 2023 6:47 AM GMT
Next Story