Telugu Global
Cinema & Entertainment

Avika Gor - తొలిసారి ఓ హారర్ సినిమాలో అవిక

Avika Gor - తొలిసారి కెరీర్ లో పూర్తిస్థాయి హారర్ మూవీ చేసింది అవికా గౌర్. ఆ సినిమా పేరు 1920. దీని గురించి ఆమె మాటల్లోనే..

Avika Gor - తొలిసారి ఓ హారర్ సినిమాలో అవిక
X

అవికా గౌర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎలాంటి సినిమాలు చేస్తుందో కూడా తెలుసు. ఇలాంటి అమ్మాయి పూర్తిస్థాయిలో మారిపోయి, ఓ హారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడా సమయం వచ్చింది. 1920 అనే పూర్తిస్థాయి హారర్ సినిమాలో లీడ్ రోల్ పోషించింది అవికా. 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఆమె మాటల్లోనే..

- లెజెండరీ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ సమర్పణలో ఆయన స్వీయ రచనలో రూపొందిన హారర్ మూవీ 1920. ఈయనతో పనిచేయడం నా డ్రీమ్. అది నెరవేరింది.

- ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. లుక్, ఎప్పిరియన్స్ ఇలా ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక యూనిక్ హారర్ సినిమా ఇది.

- నాకు హారర్ సినిమాలు చూడటం ఇష్టమే. భయపడుతూ చూస్తాను (నవ్వుతూ). రాజుగారి గది3 హారర్ కామెడీ. కాని 1920 సినిమా, సీరియస్ హారర్ ఫిల్మ్. ఇలాంటి హారర్ సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి. చాలా కొత్త అనుభూతి ఇది. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా మరిన్ని హారర్ కథలతో నన్ను సంప్రదిస్తారు.

- నేను నిజ జీవితంలో ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతానో అలా ఉంటే సరిపోతుందని డైరక్టర్ చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం నాకు కొత్త అనుభవం ఇచ్చింది. కొత్త టెక్నాలజీ (అన్ రియల్ ఇంజిన్ ఎల్ ఈ డీ స్క్రీన్) వాడాం. దాని కోసం ఎక్కువగా ప్రిపేర్ కావాల్సి వచ్చింది. చాలా భాగం షూటింగ్ స్టూడియోస్ లో జరిగింది. టెక్నికల్ గా చాలా డిఫరెంట్ మూవీ ఇది.

First Published:  19 Jun 2023 1:53 PM GMT
Next Story