Telugu Global
Cinema & Entertainment

Avika Gor | మరో వెబ్ సిరీస్ లో అవికా గోర్

Avika Gor - ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు మంచి పాత్రలు దొరికితే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది అవికా గోర్. తాజాగా మరో సిరీస్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Avika Gor | మరో వెబ్ సిరీస్ లో అవికా గోర్
X

సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ "వధువు". ఈ వెబ్ సిరీస్ లో అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి "వధువు" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా "వధువు" వెబ్ సిరీస్ హైలైట్స్ తెలిపింది అవికా గోర్.

"డిస్నీలో ఇటీవల మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నటించాను. అదే టైమ్ లో "వధువు" ప్రాజెక్ట్ గురించి చెప్పారు. బెంగాలీ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఇందును తెలుగులోకి "వధువు"గా తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నేను గతంలో చేసిన బబ్లీనెస్ ఈ క్యారెక్టర్ లో ఉండదు. మంచి క్యారెక్టర్ దొరికింది."

"వధువు" వెబ్ సిరీస్ లో హారర్ ఎలిమెంట్స్ ఉండవంటోంది అవికా గోర్. థ్రిల్లర్ జానర్ లో ఇది సాగుతుంది. "ఇప్పటిదాకా నేను ఆన్ స్క్రీన్ పై కనీసం 20సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా చీర కట్టుకుని, హెయిర్ స్టైల్ చేసుకుని మేకప్ కావడం నాకు ఇష్టం. చిన్నారి పెళ్లి కూతురు నుంచి ఈ వధువు సిరీస్ దాకా ఎన్నో సందర్భాల్లో నాకు ఆన్ స్క్రీన్ పెళ్లి జరిగింది." అంటూ సరదాగా కామెంట్ చేసింది అవికా గోర్.

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది అవికా గౌర్. మరీ ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రల్ని ఆమె సెలక్ట్ చేసుకుంటోంది. కథ నచ్చితే తనే నిర్మాతగా మారడానికి కూడా వెనకాడ్డం లేదు. వ్యక్తిగత జీవితంలో లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే, ఇలా సెలక్టివ్ క్యారెక్టర్లతో కెరీర్ ను కూడా ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ.

First Published:  2 Dec 2023 2:55 PM GMT
Next Story