Telugu Global
Cinema & Entertainment

Avatar 2 Collection: అవతార్ 2 వారాల వసూళ్లు

Avatar the way of water collectins: ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టయిన అవతార్ 2 మూవీ, తెలుగు రాష్ట్రాలలో కూడా సూపర్ హిట్టయింది

Avatar 2 Movie Box Office Collections
X

Avatar 2 Movie Box Office Collections

జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇవాళ్టి నుంచి మూడో వారంలోకి ఎంటరైంది. ఇండియాలో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సౌత్ నుంచి ఈ సినిమాకు ఎక్కువ షేర్ వస్తోంది. ఇందులో ఏపీ,నైజాం కూడా ఉన్నాయి.


గడిచిన 2 వారాల్లో ఏపీ-నైజాం నుంచి అవతార్-2 సినిమాకు ఏకంగా 76 కోట్ల 68 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగులో ఓ స్టార్ హీరోకు వచ్చే కలెక్షన్లతో ఇది సమానం. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు. వర్కింగ్ డేస్ లో ఆక్యుపెన్సీ తగ్గుతున్నప్పటికీ, శుక్ర, శని, ఆదివారాల్లో ఈ సినిమాకు హౌజ్ ఫుల్స్ నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎ-సెంటర్స్ లో అవతార్-2 పెద్ద హిట్.


అటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే బిలియన్ (1000 మిలియన్) డాలర్ క్లబ్ లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. అమెరికాలో మంచు తుపాను ప్రభావం లేకపోతే ఈ సినిమాకు అదనంగా మరో 100 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చి ఉండేవని ట్రేడ్ ఓ అంచనాకు వచ్చింది.


తెలుగు రాష్ట్రాల్లో అవతార్-2 సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వాల్యూ 50 కోట్లు. ఆ మార్క్ ను ఇప్పటికే దాటేసిన ఈ సినిమా, ప్రస్తుతం బయ్యర్లకు లాభాలు అందిస్తోంది.

First Published:  30 Dec 2022 7:53 AM GMT
Next Story