Telugu Global
Cinema & Entertainment

Avatar 2 Movie: పైరసీని ఎలా అడ్డుకోవాలో చెప్పిన అవతార్ దర్శకుడు

Avatar 2 Movie: పైరసీని అడ్డుకోవడం ఎలా? ఈ విషయంలో అవతార్-2 సినిమా ప్రపంచానికి ఓ దారి చూపించిందా?

Avatar 2 Movie: పైరసీని ఎలా అడ్డుకోవాలో చెప్పిన అవతార్ దర్శకుడు
X

పైరసీని అడ్డుకోవడం ఎలా? దీనికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు. గతంలో మహేష్ బాబు అభిమానులు, తమ హీరో సినిమా రిలీజ్ టైమ్ లో వీడియో షాపులపై ఓ కన్నేశారు. ఆ తర్వాత మెగా హీరోల అభిమానులు, పైరసీ సెల్ ప్రారంభించారు. ఆ తర్వాత విజయ్, విశాల్ లాంటి హీరోలు ఏకంగా పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు.

ఇలా ఎంతమంది హీరోలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పైరసీ అనేది మాత్రం ఆగలేదు. దీన్ని అరికట్టే మార్గాన్ని ఎవ్వరూ కనిబెట్టలేకపోయారు. ఎట్టకేలకు పైరసీ అరికట్టడానికి ఓ మార్గాన్ని చూపించాడు దర్శకుడు జేమ్స్ కామరూన్.

కామరూన్ అద్భుత సృష్టి అవతార్-2. తాజాగా థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలోకి రాకముందే, ఈ సినిమా పైరసీ అయింది. మంచి క్వాలిటీ ప్రింట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

అయితే ఆశ్చర్యకరంగా ప్రేక్షకులు ఎవ్వరూ అవతార్-2 పైరసీ ప్రింట్ చూడలేదు. మొబైల్స్ లో లింక్ కనిపించినప్పటికీ ఎవ్వరూ డౌన్ లోడ్ చేయలేదు. అలా సినిమా పైరసీ అయినప్పటికీ ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు.

దీనికి కారణం అవతార్-2 విజువల్ వండర్ కావడమే. ఈ దృశ్యకావ్యాన్ని బిగ్ స్క్రీన్ పై చూడ్డమే కరెక్ట్ అని ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అయ్యాడు. అందుకే చేతిలో పైరసీ ప్రింట్ ఉన్నప్పటికీ ఓపెన్ చేయలేదు. అలా పైరసీ అరికట్టడానికి ఓ మార్గాన్ని చూపించాడు కామరూన్.

ఓ సినిమాను కచ్చితంగా థియేటర్లలో మాత్రమే చూడాలనే ఫీలింగ్ ను ప్రేక్షకుడికి కలిగించాలి. అప్పుడు ఆటోమేటిగ్గా పైరసీ తగ్గిపోతుంది. రీసెంట్ గా వచ్చిన కాంతార, విక్రమ్ సినిమాలు కూడా ఈ విషయాన్ని కొంతలోకొంత రుజువుచేశాయి.

First Published:  18 Dec 2022 3:35 PM GMT
Next Story