Telugu Global
Cinema & Entertainment

Avatar 2 Movie Tickets Prices: 'అవతార్2' కి అదిరిపోయే టికెట్ ధరలు?

Avatar 2 Movie Tickets Prices: అవతార్ 2' డిసెంబర్ 16 న విడుదల కాబోతోంది. చాలా ముందుగానే నిన్నటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో భారీ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Avatar 2 Movie Tickets Prices: ‘అవతార్2’ కి అదిరిపోయే టికెట్ ధరలు?
X

Avatar 2 Movie Tickets Prices: ‘అవతార్2’ కి అదిరిపోయే టికెట్ ధరలు?

సెప్టెంబర్ 23 న 'అవతార్ 1' రీరిలీజ్ సక్సెస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ తో ఎదురు చూస్తున్న 'అవతార్ 2' డిసెంబర్ 16 న విడుదల కాబోతోంది. చాలా ముందుగానే నిన్నటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో భారీ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ ఫీట్ సాధించడానికి టిక్కెట్ ధరలల్ని విపరీతంగా పెంచేస్తున్నారు. 'అవతార్1' రీరిలీజ్ సక్సెస్ తో 'అవతార్2' టికెట్ ధరలు భారీగా పెంచేయడానికి సంబంధం వుండొచ్చని అనుమానిస్తున్నారు. మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ అయితే చాలా ఖరీదైన టిక్కెట్ ధరలతో బుకింగ్స్ ని ప్రారంభించింది.

టిక్కెట్ ధరలు మినిమం 500 రూపాయల నుంచి 1200, 1300, 1500 వరకూ వున్నాయి. ఐమ్యాక్స్, 4 డీ ఎక్స్ స్క్రీన్స్ పై రేట్లు ఇంకా ఎక్కువగా వున్నాయి. బెంగుళూరులో వివిధ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ లలో చూపిస్తున్న రేట్లు 1650, 1550, 1450, 1350, 1250, 1150 , 1050, 950, 870 గా వున్నాయి. హైదరాబాద్ లో ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. అయితే ద్రవ్యోల్బణం, మాంద్యం తీవ్రంగా వున్న పరిస్థితుల్లో ప్రజలు థియేటర్‌లకి సరిగా రాని సమయంలో, ఈ అధిక ధరలనేవి మరింత నిరుత్సాహ

పరుస్తాయని, సినిమాకి విపరీతమైన డిమాండ్ వుందనే కారణంతో వినియోగదారుల్ని మభ్యపెట్టడం మంచిది కాదనీ విమర్శలు వినిపిస్తున్నాయి. .

2009 లో మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసుని బద్దలు కొట్టిన 13 ఏళ్ల తర్వాత 'అవతార్ 2' వస్తోంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ హై-ఎండ్ టెక్నాలజీతో అవతార్ యూనివర్స్ లో ఈ అండర్ వాటర్ అడ్వెంచర్ మూవీని రూపొందించారు. కామెరూన్ సినిమా లెప్పుడూ పరాజయం పాలుకాలేదు. అందుకని కామెరూన్ విశ్వసనీయతని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా టికెట్ ధరలు ఆకాశాన్నంటిం చేస్తున్నారు.

ఇతిహాసం -సైన్స్ ఫిక్షన్ వీటి చుట్టూ అల్లిన కథతో 2009 లో 'అవతార్' మొదటి భాగం వస్సూళ్లలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు 'అవతార్ 2' పై కూడా అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు. ఇండియాలో కూడా ఈ సినిమాపై భారీ ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మొత్తం ఆరు భాషల్లో విడుదల కానుంది. దీని రన్‌టైమ్ 3 గంటల 10 నిమిషాలు వుంటుందని తెలుస్తోంది. దీని బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు. అంటే సుమారు 2026 కోట్ల రూపాయలు!

సెప్టెంబర్ 23 న 'అవతార్ 1' రీరిలీజ్ చేసినప్పుడు ఇండియాలో 6 కోట్లు వసూలు చేసి ఆశ్చర్య పర్చింది. ఈ క్రేజ్ చూసే 'అవతార్ 2' టికెట్ రేట్లు విపరీతంగా పెంచేసినట్టు అనుమానిస్తున్నారు. రీరిలీజ్ ప్రపంచవ్యాప్తంగా 15-20 మిలియన్ డాలర్లు లక్ష్యంగా చేసుకుని విడుదల చేస్తే దాదాపు ఈ లక్ష్యాన్ని సాధించింది. హాలీవుడ్ సినిమాలకి దక్షిణ భారతదేశం ప్రధాన మార్కెట్ అని తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని 'అవతార్ 2' ప్రీ-రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు అని, కేరళలో 50 కోట్లు అనీ సమాచారం.

డిసెంబర్ 16 న దేశ వ్యాప్తంగా 3000 కంటే ఎక్కువ స్క్రీన్స్ పై విడుదల చేసే అవకాశముంది. నిన్నటి తో సహా ఇప్పటికీ విడుదలైన మూడు ట్రైలర్లు 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌' పై అంచనాలని భారీగా పెంచేశాయి. తాజా ట్రైలర్‌లో జేక్‌ సల్లీ, నెయ్‌తిరి తమ పిల్లలకి నీటిలో డ్రాగన్ పై ఎలా స్వారీ చేయాలో నేర్పుతూంటారు. నీటి ప్రపంచంలో మనుగడ సాగించాలంటే ఇది నేర్చుకోవాల్సిందేనని చెప్పడం ట్రైలర్‌లో చూడొచ్చు. ఇక ఆ తర్వాత తమపైకి మరోమారు దండెత్తి వచ్చే మనిషిని ఎలా ఎదుర్కొన్నారో చూపించే ప్ర యత్నం చేశారు. 'అవతార్‌' మూవీలో నేలపై వున్న పండోరా ప్రపంచాన్ని చూపించిన కామెరూన్‌, ఈసారి నీటి లోపలి పండోరా ప్రపంచాన్ని చూపించనున్నారు.

ఈ మూవీ ఏదైనా లాభాల్ని కళ్ళ జూడాలంటే 2 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేయవలసి వుంటుందని తాజా ఇంటర్వ్యూలో కామెరూన్ పేర్కొన్నారు. సినిమా చరిత్రలో ఇది వరస్ట్ బిజినెస్ కేస్ అన్నారూ. అయితే ఇక్కడ గమనార్హం ఏమిటంటే, 'అవతార్ 1' 2009లో తెరపైకి వచ్చినప్పుడు 2.9 బిలియన్ల డాలర్లు వసూలు చేసింది! ఇప్పుడు ఈ సీక్వెల్ మళ్ళీ అదే మ్యాజిక్‌ ని క్రియేట్ చేయగలదా అనేది చూడాలి.



First Published:  23 Nov 2022 7:44 AM GMT
Next Story