Telugu Global
Cinema & Entertainment

Avatar 2 Movie Collections: అవతార్-2 మొదటి రోజు వసూళ్లు ఇవే

Avatar 2 Movie Box Office Collections: భారీ అంచనాల మధ్య వచ్చిన అవతార్-2 సినిమా అంచనాలు అందుకుంది. తొలి రోజు ఈ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు వచ్చాయి

Avatar 2 Movie Box Office Collections
X

Avatar 2 Movie Box Office Collections

Avatar 2 Movie Box Office Collections అవతార్: ది వే ఆఫ్ వాటర్ బాక్సాఫీర్ రికార్డుల పరంపర మొదటి రోజు నుంచే మొదలైంది. ఈ చిత్రానికి సినిమా హాళ్లలో విపరీతమైన ఫుట్‌ఫాల్ కనిపిస్తోంది.

జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు శుక్రవారం రూ. 38.50 కోట్లు నుంచి రూ. 40.50 కోట్ల రూపాయలను మధ్య రాబట్టింది. దీనితో అవతార్-2 భారతీయ మార్కెట్‌లో 2019 చిత్రం ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ తర్వాత, భారత్ లో బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనర్ గా నిలిచింది. ఎవెంజర్స్ సినిమాకు తొలి రోజున రూ. 53.10 కోట్లు వచ్చాయి.

అయితే అవతార్-2లో అగ్రభాగం సౌత్ నుంచే వచ్చింది. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచే ఈ సినిమాకు దాదాపు 70శాతం వసూళ్లు వచ్చాయి. ఈ 3 రాష్ట్రాల నుంచి 22 కోట్ల రూపాయలు వచ్చాయి. అటు కర్నాటకలో ఈ సినిమాకు తక్కువ రెస్పాన్స్ కనిపించింది. డబ్బింగ్ సినిమాలను వాళ్లు ఎంకరేజ్ చేయరు.

మిగతా రీజియన్లలో టోటల్ గా రూ.17 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కరోనా మహమ్మారి తర్వాత ఇంత భారీ ఓపెనింగ్ రావడం ఇదే తొలిసారి. నైజాం/ఆంధ్రా నుండి వస్తున్న గణాంకాలు అవెంజర్స్ ఎండ్‌గేమ్ కంటే రెట్టింపు సంఖ్యలో ఉన్నాయి.

ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తొలి వారాంతంలో (3 రోజుల్లో) ఈ సినిమా రూ.100 కోట్ల మార్కు అందుకునే అవకాశం ఉంది.

First Published:  17 Dec 2022 12:41 PM GMT
Next Story