Telugu Global
Cinema & Entertainment

Avatar 2: బిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన అవతార్-2

Avatar 2: అవతార్ - ది వే ఆఫ్ వాటర్ మరో రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిలియన్ డాలర్ వసూళ్లు సాధించింది

Avatar 2 twitter review: అవతార్ -2 మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Avatar 2 twitter review: అవతార్ -2 మూవీ ట్విట్టర్ రివ్యూ

వరల్డ్ బాక్సాఫీస్ పై తన పట్టు చూపించింది అవతార్ సినిమా. మిక్స్ డ్ రివ్యూస్ తో ఓపెన్ అయిన ఈ మూవీ, అఖండ విజయం సాధించింది. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ తో పోల్చి చూస్తే, ఇది కాస్త వెనకబడి ఉన్నప్పటికీ వసూళ్లలో మాత్రం అన్-స్టాపబుల్ అనిపించుకుంది.

జేమ్స్ కామరూన్ సృష్టించిన ఈ అద్భుత దృశ్యకావ్యం, తాజాగా బిలియన్ మార్క్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మిలియన్ డాలర్లు (ఒక బిలియన్) వసూళ్లు అందుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. భారతీయ కరెన్సీలో చూసుకుంటే, ఈ మొత్తం విలువ అక్షరాలా 8282 కోట్ల రూపాయలు.

ఇక్కడో చిన్న గమ్మత్తైన విషయాన్ని చెప్పుకోవాలి. అవతార్ సినిమా వివిధ భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 4 సీక్వెల్స్ కు వెయ్యి మిలియన్ డాలర్ల బడ్జెట్ ను కేటాయించారు నిర్మాతలు. ఇప్పుడా మొత్తం అంతా కేవలం అవతార్-2 సినిమాతోనే వచ్చేసింది.

ఓవైపు అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా భయాలు పెరుగుతున్నప్పటికీ అవతార్-2 సినిమా మాత్రం ఆగలేదు. అమెరికా వెలుపల చూసుకుంటే.. చైనా, ఫ్రాన్స్, భారత్, కొరియా దేశాల నుంచి ఈ సినిమాకు ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి.

First Published:  29 Dec 2022 5:30 AM GMT
Next Story