Telugu Global
Cinema & Entertainment

Auto Ramprasad: ఆటోరామ్ ప్రసాద్ కు ఏమైంది?

Auto Ram Prasad Health: జబర్దస్త్ ఫేమ్ ఆటోరామ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై 2 రోజులుగా వరుసగా ఊహాగానాలు చెలరేగాయి. వాటిపై ఈ నటుడు స్పందించాడు.

Auto Ramprasad: ఆటోరామ్ ప్రసాద్ కు ఏమైంది?
X

జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో రామ్ ప్రసాద్. ఆ కార్యక్రమంలో ఆటో పంచ్ లు వేసేది ఈయనే. ఇతగాడికి సంబంధించి మీమ్స్ కూడా సోషల్ మీడియాలో చాలా పాపులర్. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్.. వీళ్లంతా ఒక బ్యాచ్. వీళ్లలో సుడిగాలి సుధీర్ బాగా క్లిక్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాడు. గెటప్ శ్రీను కూడా చాలా సినిమాల్లో నటిస్తున్నాడు.

మరో ఆటో రామ్ ప్రసాద్ పరిస్థితేంటి? తను జబర్దస్త్ లోనే కొనసాగుతానని గతంలో ప్రకటించాడు ఈ నటుడు. ఈ గ్యాప్ లో ఆయన తలపై సర్జరీ క్యాప్ పెట్టుకొని కనిపించడంలో పుకార్లు వ్యాపించాయి

ఆటో రామ్ ప్రసాద్ గుండు కొట్టించుకున్నాడు. తలపై సర్జరీ క్యాప్ పెట్టుకున్నాడు. దీంతో అతడికి కాన్సర్ సోకిందని చాలామంది భావించారు. చాలామంది వరుసగా కథనాలు కూడా ఇచ్చేశారు. ఎట్టకేలకు తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు ఆటో రామ్ ప్రసాద్.

ఈ నటుడు తలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడట. దాని కోసమే గుండు కొట్టించుకున్నాడట. ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు తలపై సర్జరీ క్యాప్ పెట్టుకున్నాడు. దాన్ని మీడియా మరోలా అర్థం చేసుకుందని, తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు తాజాగా రామ్ ప్రసాద్ ప్రకటించాడు.

Next Story