Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu | ఈసారి కొత్త మహేష్ ను చూస్తారు

Mahesh Babu - గుంటూరుకారం సినిమాలో కొత్త మహేష్ ను చూస్తారని చెబుతున్నాడు హీరో మహేష్ బాబు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రత్యక ఆకర్షణగా నిలిచాడు.

Mahesh Babu | ఈసారి కొత్త మహేష్ ను చూస్తారు
X

గుంటూరుకారం సినిమాతో కొత్త మహేష్ ను చూస్తారని అంటున్నాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ తో కలిసి పని చేసిన ప్రతిసారి మేజిక్ జరిగిందని, గుంటూరు కారంతో కూడా ఆ మేజిక్ రిపీట్ అవుతుందని అన్నాడు.

"త్రివిక్రమ్ తో సినిమా చేసిన ప్రతిసారి నా పెర్ఫార్మెన్స్ లో ఒక మేజిక్ జరుగుతుంటుంది. అది నాక్కూడా తెలీదు. అతడు సినిమాతో మా జర్నీ మొదలైంది. ఖలేజాలో నా పెర్ఫార్మెన్స్ లో మేజిక్ జరిగింది. అదే మేజిక్ ఇప్పుడు గుంటూరుకారంలో కూడా జరిగింది. అంతా ఓ కొత్త మహేష్ ను చూడబోతున్నారు. దానికి త్రివిక్రమే కారణం."

గుంటూరులో గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ లో మాట్లాడిన మహేశ్, త్రివిక్రమ్ పై ప్రశంసలు కురిపించాడు. రెండేళ్లు తనకు సపోర్ట్ గా నిలిచిన త్రివిక్రమ్ కు థ్యాంక్స్ చెప్పాడు.

ఇక సినిమాలో కుర్చీ మడతపెట్టి అనే రీమిక్స్ ను తాను, త్రివిక్రమ్ కలిసి తమన్ కు సూచించామని.. ఆ వెంటనే తమన్ మంచి పాట కంపోజ్ చేశాడని చెప్పుకొచ్చాడు. 12న గుంటూరుకారం సినిమా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  9 Jan 2024 5:05 PM GMT
Next Story