Telugu Global
Cinema & Entertainment

Atulya Ravi - టాలీవుడ్ తెరపైకి మరో తమిళ భామ

Atulya Ravi - టాలీవుడ్ లోకి మరో తమిళ్ బ్యూటీ ఎంటర్ అయింది. ఆమె పేరు అతుల్య రవి.

Atulya Ravi - టాలీవుడ్ తెరపైకి మరో తమిళ భామ
X

తమిళ ముద్దుగుమ్మలు తెలుగుతెరపై మెరవడం కొత్తేంకాదు. ఇంకా చెప్పాలంటే, టాలీవుడ్ లో క్లిక్ అయిన హీరోయిన్లలో ఎక్కువమంది తమిళ అందగత్తెలే. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో అమ్మాయి చేరబోతోంది. ఆమె పేరు అతుల్య రవి.


కోలీవుడ్ లో కొన్ని సినిమాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ, టాలీవుడ్ తనకు కొత్తగా అనిపించలేదని చెబుతోంది.


"టాలీవుడ్ నాకు కొత్తగా అనిపించలేదు. కథ విన్నప్పుడే చాలా కంఫర్ట్ బుల్ అనిపించింది. లుక్ టెస్ట్ అయిన తర్వాత నేరుగా షూటింగ్ కి వెళ్ళాం. కిరణ్ కూడా చాలా ఫ్రెండ్లీ. తనలాగే నేను కూడా షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మూవీ చేసే వచ్చాను. ఆ కామన్ కనెక్షన్ మొదట్నుంచి ఉంది. మేము ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుకుంటాం. అలా టాలీవుడ్ కొత్తగా ఉందనే ఫీలింగ్ నాకు రాలేదు."


మీటర్ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెబుతోంది అతుల్య. అబ్బాయిలంటే ఇష్టంలేని అమ్మాయిగా నటించానని, తన క్యారెక్టర్ తో ఫన్ కూడా పుడుతుందని చెప్పుకొచ్చింది.

First Published:  29 March 2023 1:43 PM GMT
Next Story