Telugu Global
Cinema & Entertainment

Love Me Teaser | దిల్ రాజు మెచ్చిన టీజర్

Love Me Movie Teaser: లాంగ్ గ్యాప్ తర్వాత ఆశిష్ నుంచి వస్తున్న సినిమా లవ్ మి. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

Love Me Teaser | దిల్ రాజు మెచ్చిన టీజర్
X

Love Me Movie Teaser: ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిది నిర్మించారు. ఈ మూవీకి అరుణ్ భీమవరపు దర్శకుడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. గురు నానక్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొంది.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఆర్య సినిమాతో సుకుమార్‌ను ఇంట్రడ్యూస్ చేశాం. ఆర్య విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ కథ విన్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఇలాంటి పాయింట్‌తో ఇంత వరకు కథ రాలేదు. పీసీ శ్రీరామ్ గారి కెమెరా, కీరవాణి గారి సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. త్వరలోనే పాటను రిలీజ్ చేయబోతోన్నాం. అది యూత్‌కు బాగా నచ్చేస్తుంది."

ఈ చిత్రానికి హీరోయిన్ చాలా ముఖ్యమని.. బేబీ సినిమా రిలీజైన వెంటనే వైష్ణవిని లాక్ చేశామని తెలిపారు దిల్ రాజు. స్క్రిప్ట్ ను 4 గంటల పాటు చదివి, నచ్చిన తర్వాతే వైష్ణవి ఓకే చేసిందని అన్నారు. వైష్ణవి లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదన్నారు.

ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ లో సినిమా లైన్ ఏంటనేది చెప్పారు. దెయ్యం కథతో వస్తున్న ఈ సినిమాలో హీరో దెయ్యాన్ని ప్రేమిస్తాడు, ఆమెతో రొమాన్స్ కూడా చేస్తాడు. అతడు ఎందుకలా చేస్తున్నాడు.. ఇంతకీ దెయ్యం ఎవరనేది బ్యాలెన్స్ కథ.



First Published:  7 March 2024 5:32 PM GMT
Next Story