Telugu Global
Cinema & Entertainment

Shivam Bhaje | శివుడి నేపథ్యంలో మరో మూవీ

Shivam Bhaje - హిడింబి తర్వాత కొత్త సినిమా చేస్తున్నాడు అశ్విన్ బాబు. ఈ సినిమాకు శివం భజే అనే టైటిల్ పెట్టారు.

Shivam Bhaje | శివుడి నేపథ్యంలో మరో మూవీ
X

అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్ర టైటిల్ ను ఈ రోజు ప్రకటించారు.

గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై గా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'శివం భజే' అని టైటిల్ పెట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తోంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమాగా దీన్ని చెబుతున్నారు మేకర్స్. కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్స్ తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందంట.

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ విలన్ సాయి ధీనా, హైపర్ ఆది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని భారీ రిలీజ్ కి సిద్ధమైంది శివం భజే. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట.




First Published:  11 March 2024 5:09 PM GMT
Next Story