Telugu Global
Cinema & Entertainment

Ashu Reddy: డ్రగ్స్ ఆరోపణల్లో నిజం లేదంటున్న అషు రెడ్డి

Ashu Reddy: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. కేపీ చౌదరి విచారణలో అషు రెడ్డి పేరు బయటకొచ్చినట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై అషు స్పందించింది.

Ashu Reddy: డ్రగ్స్ ఆరోపణల్లో నిజం లేదంటున్న అషు రెడ్డి
X

Ashu Reddy: డ్రగ్స్ ఆరోపణల్లో నిజం లేదంటున్న అషు రెడ్డి

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు చెలరేగాయి. పోలీసులకు అడ్డంగా దొరికిన కేపీ చౌదరిని 2 రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అతడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. నిన్నటితో ఆ కస్టడీ ముగిసింది.

కేపీ చౌదరి కస్టడీ ఇలా ముగిసిందో లేదో అలా కొంతమంది ప్రముఖుల పేర్లు తెరపైకొచ్చాయి. దాదాపు 12 మంది పేర్లు వెలుగులోకి రాగా, మీడియా ఎక్కువగా అషు రెడ్డి పేరును ప్రస్తావించింది. కేపీ చౌదరి, అషు రెడ్డి మధ్య వందల కాల్స్ సంభాషణలు నడిచాయంటూ కథనాలు వచ్చాయి.

వీటిపై తాజాగా స్పందించింది అషు రెడ్డి. తనపై వస్తున్న వార్తల్ని ఆమె ఖండించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని, డ్రగ్స్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటించింది.

కొంతమందితో లింక్ చేస్తూ తనపై వండివారుస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం అంటోంది అషు రెడ్డి. చెప్పాల్సి వస్తే, సరైన వ్యక్తుల వద్ద, చెప్పాల్సిన నిజాలన్నీ చెబుతానంటూ ప్రకటించింది. మరోవైపు తన ఫోన్ నంబర్ ను వెల్లడించడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. తన ఫోన్ నంబర్ ను బహిర్గతం చేస్తే సహించనని తెలిపింది.

కొన్ని రోజుల కిందట రాజేంద్రనగర్ పరిధిలో మాదకద్రవ్యాలతో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి. అతడ్ని కోర్టు రిమాండ్ కు పంపింది. తాజాగా 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ కస్టడీ నిన్నటితో ముగిసింది. త్వరలోనే ఛార్జ్ షీట్ బయటకు రానుంది. ఛార్జ్ షీట్ ప్రకారం, వ్యక్తులకు నోటీసులు జారీ చేయబోతున్నారు పోలీసులు.

First Published:  24 Jun 2023 4:13 AM GMT
Next Story