Telugu Global
Cinema & Entertainment

Aakasam Movie Trailer: ఆకాశం ట్రయిలర్ రివ్యూ

ముగ్గురు హీరోయిన్లతో, మంచి విజువల్స్ తో ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమా ఆకాశం. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ లాంఛ్ అయింది.

Aakasam Movie Trailer: ఆకాశం ట్రయిలర్ రివ్యూ
X

విలక్షణ నటుడు అశోక్ సెల్వన్ తాజా చిత్రం ఆకాశం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది ఈ సినిమా. తమిళ్ లో దీనికి 'నీదాం ఒరు వానమ్' అని పేరు పెట్టారు. రెండు భాషల్లో నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌ గా నటించారు.

ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఆసక్తిని మరింత పెంచుతూ, తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు. హీరో నాని చేతుల మీదుగా ఈ ట్రయిలర్ రిలీజైంది.

అశోక్ సెల్వన్, 3 కాలాల్లో కనిపిస్తున్నాడు. అలా 3 గెటప్స్ లో కూడా కనిపిస్తున్నాడు. అతని లైఫ్‌లో మూడు దశల్లోని జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించినట్లు ట్రయిలర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక పాత్రలను తీర్చిదిద్దిన తీరు, వాటిని వారు క్యారీ చేసిన విధానం బాగుంది.

ప్రేమ, మోసం సహా లైఫ్‌లోని ఇతర భావోద్వేగాలు హీరో అశోక్ సెల్వన్ పాత్రలో కనిపిస్తున్నాయి. ట్రైలర్‌లో విదు అయ్యన్న సినిమాటోగ్రఫీ, గోపీసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అందమైన లొకేషన్లు ట్రయిలర్ లో కట్టిపడేశాయి.



First Published:  29 Oct 2022 11:55 AM GMT
Next Story