Telugu Global
Cinema & Entertainment

Ashok Galla - రెండో సినిమా రెడీ చేస్తున్న అశోక్ గల్లా

Ashok Galla - హీరో సినిమాతో ఫ్లాప్ చూసిన అశోక్ గల్లా, ఇప్పుడు తన రెండో సినిమాను రెడీ చేసే పనిలో పడ్డాడు.

Ashok Galla - రెండో సినిమా రెడీ చేస్తున్న అశోక్ గల్లా
X

‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసి అందరినీ అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా. ప్రస్తుతం ఈ హీరో తన రెండవ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 'గుణ 369' ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, సోమినేని బాలకృష్ణ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమౌతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా మూడో షెడ్యూల్ తాజాగా వైజాగ్ లో ప్రారంభమైంది. ఈ లెంగ్తీ షెడ్యుల్ లో సాంగ్, ఫైట్, టాకీ పార్ట్ షూట్ చేస్తున్నారు. ఈ కీలకమైన షెడ్యూల్ లో టీం అంతా పాల్గొంటోంది. ఇటీవలే అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన పాపులర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు.

First Published:  15 Jun 2023 5:24 PM GMT
Next Story