Telugu Global
Cinema & Entertainment

Ashish Vidyardhi - పుకార్లు ఖండించిన సీనియర్ నటుడు

Ashish Vidyardhi - నటుడు ఆశిష్ విద్యార్థి తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలు పుకార్లపై ఆయన వివరణ ఇచ్చాడు.

Ashish Vidyardhi - పుకార్లు ఖండించిన సీనియర్ నటుడు
X

రీసెంట్ గా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఆశిష్ విద్యార్థి. మొదటి భార్యకు విడాకులిచ్చి, తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓవైపు మళ్లీ పెళ్లి అనే సినిమా రిలీజ్ అవ్వడం, ఇటు 60 ఏళ్ల ఆశిష్ మళ్లీ పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు అతడు 35 ఏళ్ల మహిళను పెళ్లాడడనే కథనాలు కూడా వచ్చాయి. వీటన్నింటిపై ఆశిష్ విద్యార్థి క్లారిటీ ఇచ్చాడు.

మొదటి భార్యతో 22 ఏళ్లు కాపురం చేసిన ఆశిష్.. కొన్నేళ్లుగా తమ బంధం సజావుగా సాగడం లేదని స్పష్టం చేశాడు. అదే టైమ్ లో తను రుపాలీకి కనెక్ట్ అయ్యానని, రెండేళ్లు తామిద్దరం ఛాటింగ్ చేసుకున్నామని, ఆ తర్వాత కలిశామని తెలిపాడు. ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్న తర్వాత, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

ఈ సందర్భంగా తమ వయసులపై కూడా క్లారిటీ ఇచ్చాడు ఆశిష్. ఈ సీనియర్ నటుడి వయసు 57 సంవత్సరాలంట. ఇక మీడియా చెబుతున్నట్టు రుపాలీ వయసు 35 ఏళ్లు కాదంట. ఆమె వయసు 50 ఏళ్లు అని స్పష్టంచేశాడు ఆశిష్.

తామిద్దరం వయసు గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, సంతోషంగా గడపడం గురించే ఆలోచించామని అన్నాడు ఆశిష్. ఇష్టమైన వారితో ప్రపంచం చుట్టాలనే కోరిక తనకు ఉందని, అందుకే రుపాలీని పెళ్లి చేసుకున్నట్టు తెలిపాడు.

First Published:  27 May 2023 10:39 AM GMT
Next Story