Telugu Global
Cinema & Entertainment

Ashika Ranganadh: కన్నడ-తెలుగు చిత్రసీమల మధ్య తేడా అదే!

Ashika Ranganadh - అమిగోస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ అషికా రంగనాధ్. ఈ సందర్భంగా రెండు చిత్ర పరిశ్రమల మధ్య తేడా చెప్పింది.

Ashika Ranganadh: కన్నడ-తెలుగు చిత్రసీమల మధ్య తేడా అదే!
X

కన్నడలో ఆమెకు మంచి పేరుంది. కానీ తెలుగులో ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఆ బ్యూటీ పేరు అషికా రంగనాధ్. ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి ఆమెకు అవకాశం వచ్చింది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన అషిక, శాండిల్ వుడ్, టాలీవుడ్ మధ్య తేడా చెప్పింది. మరీ ముఖ్యంగా ప్రచారం విషయంలో రెండు పరిశ్రమల మధ్య తేడా ఉందంటోంది.

"టాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌కి వ‌ర్క్ ఎన్విరాన్‌మెంట్ పరంగా పెద్ద‌గా తేడా లేదు. భాష మాత్ర‌మే వ్య‌త్యాసం. అయితే తెలుగులో మాత్రం ప్ర‌మోష‌న్స్ చాలా బాగా చేస్తారు. మంచి ప్లానింగ్‌తో ముందుకెళ‌తారు. తెలుగు సినిమాల్లో పబ్లిసిటీ చాలా బాగా చేస్తారనే పేరు ఫస్ట్ నుంచి ఉంది. అలాగే సినిమాలు కూడా చాలా లావిష్ గా తీస్తారు. కన్నడ ఇండస్ట్రీలో కూడా పబ్లిసిటీ బాగా చేస్తారు కానీ తెలుగుతో పోలిస్తే ఇంతకుముందు అక్కడ అంతగా ఉండేది కాదు, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నారు."

ఇలా తెలుగు-కన్నడ పరిశ్రమల మధ్య తేడాను తను గమనించిన తేడాను బయటపెట్టింది అషికా. తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైమ్ పట్టిందంటున్న ఈ బ్యూటీ, గతంలో కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేకపోవడం వల్ల కొన్ని ఆఫర్లు వదులుకున్నానని తెలిపింది.

Next Story