Telugu Global
Cinema & Entertainment

పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేసిన ఆర్య

హీరో ఆర్య ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ సినిమాకు ముత్తయ్య దర్శకత్వం వహిస్తాడు

పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేసిన ఆర్య
X

జీ స్టూడియోస్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లు కలిశాయి. ఆర్య హీరోగా కొత్త సినిమా స్టార్ట్ చేశాయి. కెరీర్ లో ఆర్యకు ఇది 34వ సినిమా.

కొత్త కథలు, పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు ఆర్య. టెడ్డీ, సార్పట్ట పరంపర, కెప్టెన్ వంటి వరుస విజయాలతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడీ కొత్త సినిమా కూడా అలాంటి కొత్త కథతోనే వస్తోంది. సిద్ధి ఇద్నాని ఈ చిత్రంలో హీరోయిన్.

దర్శకుడు ముత్తయ్య, ఈ సినిమాలో ఆర్యను మరింత కొత్తగా చూపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన 'విరుమాన్'తో సహా గ్రామీణ నేపధ్యంలో కమర్షియల్‌గా విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు అందించడంలో పేరు తెచ్చుకున్న ముత్తయ్య, ఈ ప్రాజెక్ట్‌తో మరోసారి తన మార్క్ చూపించబోతున్నాడు.

ఆర్య-ముత్తయ్య కాంబోలో ఇదే తొలి సినిమా. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి వేల్‌రాజ్, సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. తాజాగా లాంచ్ అయిన ఈ సినిమా, ఈ నెలలోనే సెట్స్ పైకి రాబోతోంది.

First Published:  10 Oct 2022 4:35 AM GMT
Next Story