Telugu Global
Cinema & Entertainment

Mission Chapter 1 - మిషన్ ఛాప్టర్-1 టీజర్ ఎలా ఉందంటే..!

Arun Vijay's Mission Chapter 1 Movie Teaser - అరుణ్ విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం మిషన్-ఛాప్టర్ 1. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజైంది.

Mission Chapter 1 - మిషన్ ఛాప్టర్-1 టీజర్ ఎలా ఉందంటే..!
X

అరుణ్ విజయ్ హీరోగా నటించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘మిషన్: చాప్ట‌ర్ 1’. ‘ఫియర్‌లెస్ జ‌ర్నీ’ ట్యాగ్ లైన్. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుద‌ల చేశారు.

‘మిషన్: చాప్ట‌ర్ 1’ను గ‌మ‌నిస్తే... ఇది లండ‌న్‌లో పేరు మోసిన వాండ్స్ వ‌ర్త్ జైలు బ్యాక్ డ్రాప్‌లో న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ప్ర‌పంచంలోని ఖైదీలంద‌రూ ఆ జైలులో ఉంటారు. ఆ జైలుకు సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో ఎమీ జాక్స‌న్ న‌టిస్తుంది. ఇక ఆ జైలులో ఓ ఖైదీ పాత్ర‌లో హీరో అరుణ్ విజ‌య్ న‌టించాడు. కుటుంబంతో ఇండియా నుంచి లండ‌న్ వ‌చ్చిన అరుణ్ విజ‌య్‌ని అక్క‌డి పోలీసులు అరెస్ట్ చేస్తారు. త‌న కుమార్తెకు మ‌రో రెండు రోజుల్లో ఆప‌రేష‌న్ ఉంటుంది. త‌నేమో జైలులో ఉంటాడు. త‌న కూతురేమో తండ్రి కోసం ఎదురు చూస్తుంటుంది. అస‌లేం జరిగింది..హీరో అరుణ్ విజ‌య్ ఏ కార‌ణాల‌తో వాండ్స్‌వ‌ర్త్ జైలుకి వెళ్లాడు. చివ‌ర‌కు వాండ్స్ వ‌ర్త్ జైలు సూప‌రిడెంట్ ఆఫీస‌ర్ అయిన ఎమీ జాక్స‌న్ ఏమైనా హెల్ప్ చేసిందా? అనేది సినిమా స్టోరీ.

ఆక‌ట్టుకునే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ‘మిషన్: చాప్ట‌ర్ 1’ టీజ‌ర్ సూప‌ర్బ్‌గా ఉంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ బీజీఎం సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలిచింది.

డైరెక్ట‌ర్ విజ‌య్ పక్కా ప్లానింగ్‌తో ఇంత భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని 70 రోజుల్లోనే పూర్తి చేశాడు. అలాగే ఈ మూవీ కోసం లండ‌న్ వాండ్స్ వ‌ర్త్ జైలు సెట్ ను చెన్నైలో సృష్టించారు. హీరో అరుణ్ విజ‌య్ రిస్కీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో స్వ‌యంగా న‌టించాడు.

యూనివర్సల్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ వరల్డ్ వైడ్ విడుదల చేయడానికి ముందుకొచ్చింది. దీంతో ఈ సినిమా పరిధి మరింత పెరిగినట్టయింది.



First Published:  6 April 2023 4:21 AM GMT
Next Story