Telugu Global
Cinema & Entertainment

Aakrosham: అరుణ్ విజయ్ నుంచి మరో సినిమా

Arun Vijay Aakrosham: సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అరుణ్ విజయ్. అప్పట్నుంచి తన సినిమాల్ని తెలుగులోకి డబ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ హీరో నుంచి ఆక్రోశం అనే మరో మూవీ సిద్ధమైంది.

Aakrosham: అరుణ్ విజయ్ నుంచి మరో సినిమా
X

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అరుణ్ విజ‌య్. తాజాగా ఈ నటుడు నటించిన మరో సినిమా తెలుగులోకి డబ్ అయింది. తెలుగులో ఈ సినిమాకు ఆక్రోశం అనే టైటిల్ పెట్టారు. ఈమధ్య అరుణ్ విజయ్ సినిమాను ఏనుగు పేరిట తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత సతీష్, ఈ మూవీని కూడా సమర్పిస్తున్నారు.

ఇదొక యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఎమోషనల్‌ రివేంజ్ డ్రామా కూడా ఉంది. తమిళ్ లో ఈ సినిమా పేరు 'సినం'. తెలుగులో 'ఆక్రోశం' అనే పేరు పెట్టారు. డిసెంబర్ 9న ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా ఆల్రెడీ తమిళంలో రిలీజైంది. అక్కడ దీనికి ఓ మోస్తరు ఆదరణ దక్కింది. తెలుగు ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. పల్లక్ లల్వాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్‌ ఓ కీలక పాత్ర పోషించాడు.

First Published:  1 Dec 2022 3:47 AM GMT
Next Story