Telugu Global
Cinema & Entertainment

Naresh | 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న నరేష్

Artist Naresh - నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు సీనియర్ నటుడు నరేష్. ఈ సందర్భంగా తనను నటుడిగా నిలబెట్టిన దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Naresh | 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న నరేష్
X

"నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 50 ఏళ్ళు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా ప్రేక్షకులు ప్రేమాభిమానాల వల్లనే సాధ్యమైంది. నా జీవితాంతం సినీ పరిశ్రమకు సేవ చేస్తాను." అన్నారు ప్రముఖ నటుడు నరేష్. నటుడిగా 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన విలేకర్లతో ముచ్చటించారు.

"9వ ఏట పండంటి కాపురం లాంటి అద్భుతమైన చిత్రంతో ఆరంగేట్రం చేశాను. అయితే బాల నటులుగా వచ్చిన వాళ్ళు హీరోలుగా సక్సెస్ కారని చెబుతుంటారు. ఈ భయం ఉండేది. అయితే దాని గురించి పెద్దగా అలోచించలేదు. ఒక్క సినిమా హీరోగా నటిస్తే చాలని అనుకున్నాను. అనుకోకుండా..అమ్మగారి ప్రేమ సంకెళ్ళు, జంధ్యాల గారి నాలుగు నాలుగు స్తంభాలాట..ఇలా రెండు సినిమాలు వచ్చాయి. నాలుగు స్తంభాలాటతో నాకు అద్భుతమైన కెరీర్ స్టార్ట్ అయింది."

తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో జంధ్యాల, అమ్మ(విజయనిర్మల), విశ్వనాథ్, బాపు, రమణ, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహరావు లాంటి మహనీయులతో కలసి పని చేసే అదృష్టం దొరికిందన్నారు నరేష్. వీరందరూ నా విజయానికి పునాది వేశారని... ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు నరేష్.

First Published:  19 Jan 2024 5:06 PM GMT
Next Story