Telugu Global
Cinema & Entertainment

విశ్వక్ సేన్ పై విరుచుకుపడిన అర్జున్

విశ్వక్ సేన్, అర్జున్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా ఆగిపోయింది. స్వయంగా అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు.

విశ్వక్ సేన్ పై విరుచుకుపడిన అర్జున్
X

హీరో విశ్వక్ సేన్ పై సీనియర్ నటుడు అర్జున్ విరుచుకుపడ్డారు. విశ్వక్ కు క్రమశిక్షణ లేదన్నారు, కమిట్ మెంట్ బొత్తిగా తేలియదన్నారు. విశ్వక్ పై అర్జున్ ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి?

కొన్ని రోజుల కిందట సంగతి. విశ్వక్ సేన్ హీరోగా తన సొంత నిర్మాణ సంస్థలో, స్వీయదర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు అర్జున్. అంతేకాదు, ఆ సినిమాలో విశ్వక్ సేన్ సరసన తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. రామానాయుడు స్టుడియోస్ లో సినిమా ఘనంగా లాంఛ్ అయింది. ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయంటున్నారు అర్జున్.

తన సినిమా షూటింగ్ కు విశ్వక్ సేన్ రావడం లేదని ఆరోపించారు అర్జున్. ఈనెల 3వ తేదీ నుంచి నెల రోజుల పాటు షెడ్యూల్ పెట్టుకుంటే, విశ్వక్ వల్ల కాన్సిల్ అయిందన్నారు. కథాచర్చలు పూర్తయి, రెమ్యూనరేషన్ కింద అడ్వాన్స్ కూడా ఇచ్చానని, అయినప్పటికీ విశ్వక్ ఇలా షూటింగ్ ఎగ్గొట్టడం సమంజసం కాదంటున్నారు అర్జున్.

ఇప్పటివరకు తను ఏ నటుడు, టెక్నీషియన్ కు ఇన్నిసార్లు కాల్ చేయలేదని, విశ్వక్ కు మాత్రం ప్రతి రోజు కాల్ చేశానని చెప్పుకొచ్చిన అర్జున్.. అతడి నుంచి ఎప్పటికప్పుడు దాటవేత సమాధానాలే వచ్చాయన్నారు. ఇకపై విశ్వక్ తో సినిమా చేసేది లేదని తెగేసి చెప్పారు అర్జున్. త్వరలోనే కొత్త హీరోతో, టైటిల్ తో ఇదే కథతో సినిమా ఉంటుందన్నారు.

First Published:  5 Nov 2022 12:30 PM GMT
Next Story