Telugu Global
Cinema & Entertainment

Charan-Rahman - రామ్ చరణ్ సినిమాకు రెహ్మాన్ సంగీతం

AR Rahman Ramcharan - రామ్ చరణ్ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించబోతున్నాడా? అవుననే అంటున్నారు టాలీవుడ్ జనాలు.

Charan-Rahman - రామ్ చరణ్ సినిమాకు రెహ్మాన్ సంగీతం
X

టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రామ్ చరణ్ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించబోతున్నాడట. ఇంతకీ అది ఏ సినిమా? డీటెయిల్స్ చెక్ చేద్దాం..

త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. ఈ మూవీకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ప్రాధమికంగా చర్చలు ముగిశాయి.

ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహ్మాన్, ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడు. తన మనసుకు నచ్చి, కదిలించిన సన్నివేశాలుంటేనే సినిమా చేస్తాడు. లేదంటే మొహమాటం లేకుండా నో చెబుతాడు. బుచ్చిబాబు చెప్పిన స్టోరీ, రెహ్మాన్ కు నచ్చిందంటున్నారు. అసలు మేటర్ ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు చరణ్. సెప్టెంబర్ నుంచి బుచ్చిబాబు సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.

First Published:  9 April 2023 1:35 PM GMT
Next Story