Telugu Global
Cinema & Entertainment

AR Rahman - నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే

AR Rahman - మ్యూజిక్ లో ఎన్ని మార్పులొచ్చినా మెలొడీ మారదంటున్నాడు రెహ్మాన్. దాన్ని పట్టుకోవడమే తన సక్సెస్ సీక్రెట్ అని తెలిపాడు.

AR Rahman - నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే
X

ప్రపంచం మెచ్చిన దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. ఏకంగా ఆస్కార్ అందుకున్న కంపోజర్ ఇతడ. ఇండియాలోనే స్టార్ మ్యూజిక్ డైరక్టర్. మరి రెహ్మాన్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఈ విషయాన్ని రెహ్మాన్ బయటపెట్టాడు. కొన్ని దశాబ్దాలుగా తన మ్యూజిక్ ఫార్ములా ఒకటే అంటున్నాడు.

"ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ ఎప్పటికీ మారదు. వైబ్రేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. కానీ, మెలోడీ, లిరిక్ ఎప్పుడూ సేమ్. గత 35, 40 ఏళ్లుగా సేమ్ ఉంది. రోజా సినిమా నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే... సాంగ్ సింపుల్ గా, క్యాచీగా ఉండాలి. బీట్ చేంజ్ అవుతుంది. మిక్సింగ్ చేంజ్ అవుతుంది. నా కోర్ కాన్సెప్ట్, మ్యూజిక్ కంపొజిషన్, థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది."

ప్రేక్షకుల్లో, సమాజంలో మార్పులు వచ్చాయని, సహజంగానే సంగీతంపై ఆ ప్రభావం ఉంటుందన్న రెహ్మాన్.. ఆ మార్పులకు తగ్గట్టు తన మ్యూజిక్ లో చిన్నచిన్న ఛేంజెస్ ఉంటాయని తెలిపాడు. మ్యూజిక్ లో మార్పు ఉంటుంది కానీ, తన కంపోజిషన్ లో, మెలొడీలో మాత్రం మార్పు ఉండదంటున్నాడు.

ఏ బాణీ కంపోజ్ చేసినా, అది ముందు మనసుకు నచ్చాలంటున్నాడు రెహ్మాన్. మన మనసుకు నచ్చితే, అది ప్రేక్షకులకు నచ్చుతుందని చెబుతున్నాడు. ఈ సింపుల్ లాజిక్ ను ఎప్పుడూ మైండ్ లో పెట్టుకొని వర్క్ చేస్తాడట రెహ్మాన్.

First Published:  13 July 2023 4:18 AM GMT
Next Story