Telugu Global
Cinema & Entertainment

AR Rahman | చరణ్ సినిమాకు రెహ్మాన్ సంగీతం

AR Rahman - మొన్నటివరకు ఇది ఊహాగానం. కానీ ఇప్పుడు అదే నిజమైంది. చరణ్ సినిమాకు రెహ్మాన్ వర్క్ చేయబోతున్నాడు.

AR Rahman | చరణ్ సినిమాకు రెహ్మాన్ సంగీతం
X

రామ్ చరణ్, బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో వచ్చే క్రేజీ సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ పరంగా అత్యున్నతంగా ఉండబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌, అత్యంత భారీ స్థాయిలో వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు.

బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే... ఈ మెగా వెంచర్ కోసం, ఆస్కార్-విన్నింగ్ కంపోజర్ ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. బుచ్చిబాబు ఉప్పెన మ్యూజికల్ హిట్, రెండవ చిత్రం కూడా మ్యూజికల్ చార్ట్‌బస్టర్ కాబోతుంది.

ఏఆర్ రెహమాన్ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన సంగీత దర్శకుల్లో ఒకరు. దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత విశ్వవ్యాప్తమయ్యారు రెహ్మాన్. రెహమన్ సంగీతం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

First Published:  6 Jan 2024 5:04 PM GMT
Next Story