Telugu Global
Cinema & Entertainment

Apsara Rani | అప్సర అందాలతో తలకోన

Apsara Rani | అప్సర రాణి మరోసారి హీరోయిన్ అయింది. ఆమె నటించిన తలకోన సినిమా విడుదలకు సిద్ధమైంది.

Apsara Rani | అప్సర అందాలతో తలకోన
X

Apsara Rani | అప్సర అందాలతో తలకోన

Apsara Rani | అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన". అప్సర రాణి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాగా ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పాటల విడుదల కార్యక్రమం కూడా సాగుతోంది.

క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉంటుందని, అదే విదంగా పాలిటిక్స్ ని కూడా మిక్స్ చేసి చూపించడం జరిగిందని అంటున్నారు దర్శకుడు. అంతే కాకుండా ప్రకృతికి విరుద్ధంగా వెళితే జరిగే పరిణామాలు కూడా తెలిపే ప్రయత్నం చేశారట.

మెయిన్ కథాంశం ఏంటంటే, తలకోన ఫారెస్ట్ లోకి హీరోయిన్ కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్తుంది..ఎంత మంది వెళ్లారు ఎంతమంది తిరిగొచ్చారు అనేది ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిస్తున్నారు. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

అప్సర రాణి వెండితెర పై గ్లామర్ క్వీన్ అని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ టాలెంట్ కూడా చూస్తారని చెబుతున్నారు నిర్మాత. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అప్సర రాణికి క్రేజ్ తీసుకొచ్చిన ఈ దర్శకుడు.. తలకోన సినిమా సూపర్ హిట్టవ్వాలని కోరుకుంటున్నారు.

First Published:  27 Oct 2023 5:28 PM GMT
Next Story