Telugu Global
Cinema & Entertainment

April Box Office | ఏప్రిల్ సినిమాలివే!

April Box Office - మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ బాక్సాఫీస్ మొదలైంది. శుక్రవారం నుంచి సందడి షురూ కానుంది.

April Box Office | ఏప్రిల్ సినిమాలివే!
X

ఏప్రిల్ లో సినిమాలైతే చాలానే వస్తున్నాయి కానీ స్టార్ ఎట్రాక్షన్ మాత్రం కనిపించడం లేదు. మొదటి వారంలో ఫ్యామిలీ స్టార్, భరతనాట్యం, మంజుమ్మల్ బాయ్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమా ఫ్యామిలీ స్టార్ మాత్రమే. విజయ్ దేవరకొం డ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇక రెండో వారంలో గీతాంజలి మళ్లీ వచ్చింది, రోటీ కపడా రొమాన్స్, శ్రీరంగ నీతులు, తెప్ప సముద్రం, లవ్ గురు, మెర్సీ కిల్లింగ్, డియర్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒక్క సినిమాలో కూడా స్టార్ ఎట్రాక్షన్ లేదు. అంజలి నటించిన 50వ చిత్రంగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా వస్తోంది.

ఏప్రిల్ మూడోవారంలో శశివదనే, పారిజాతపర్వం సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు చిన్న సినిమాలే. కాకపోతే ప్రచారంతో బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక నాలుగో వారంలో లవ్ మీ, రత్నం సినిమాలున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆశిష్ హీరోగా లవ్ మీ వస్తోంది. సినిమాపై బజ్ లేకపోయినా, జనాల్లోకి ఎక్కించేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు దిల్ రాజు. ఇక విశాల్ హీరోగా నటించిన రత్నం సినిమాపై ఎప్పట్లానే ఎలాంటి అంచనాల్లేవు.

ఈ సినిమాలతో పాటు అల్లరి నరేష్ హీరోగా నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' అనే మూవీ కూడా విడుదలకు సిద్ధమైంది. కాకపోతే ఈ సినిమా తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

First Published:  3 April 2024 2:50 AM GMT
Next Story