Telugu Global
Cinema & Entertainment

Miss Shetty Mr Polishetty | అనుష్క సినిమా ట్రయిలర్ రెడీ

Miss Shetty Mr Polishetty - అనుష్క నటిస్తున్న తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ రెడీ అయింది.

Miss Shetty Mr Polishetty | అనుష్క సినిమా ట్రయిలర్ రెడీ
X

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు.

ఈ సినిమాకు ఇప్పటికే విడుదల తేదీ ఫిక్స్ కాగా, తాజాగా ట్రయిలర్ రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

అనౌన్స్ మెంట్ నుంచి అందరిలో ఆసక్తి కలిగించింది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది.

శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇదే. రధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

First Published:  19 Aug 2023 5:19 PM GMT
Next Story