Telugu Global
Cinema & Entertainment

Anushka Shetty: బొమ్మాలి ఫస్ట్ లుక్ అదిరింది

ప్రస్తుతం ఓకే ఒక్క సినిమా చేస్తోంది అనుష్క. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు

Anushka Shetty: బొమ్మాలి ఫస్ట్ లుక్ అదిరింది
X

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చెఫ్ పాత్రలో నటిస్తోంది అనుష్క. ప్రస్తుతం సినిమా సెట్స్ పై ఉంది.


ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అన్విత రవళి శెట్టి అనే క్యారెక్టర్ పోషిస్తోంది అనుష్క. ఇందులో ఆమె చెఫ్ గా కనిపిస్తోంది. విడుదల చేసిన పోస్టర్ లో, ఆమె కిచెన్ లో మంచి వంటకం ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపించింది.


ఈ స్పెషల్ పోస్టర్ తో అనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.అంతేకాదు, లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇది. ఆమె దాదాపు సినిమాలు ఆపేసింది.




First Published:  7 Nov 2022 12:00 PM GMT
Next Story