Telugu Global
Cinema & Entertainment

Anupama: అనుపమ అరచేతిని ముద్దాడిన అరవింద్

Anupama: అల్లు అరవింద్ తనకు తండ్రితో సమానం అంటోంది అనుపమ పరమేశ్వరన్. ఈ హీరోయిన్, ఆ స్టేట్ మెంట్ ఇవ్వడం వెనక కారణం ఏంటి?

Anupama: అనుపమ అరచేతిని ముద్దాడిన అరవింద్
X

కొన్ని రోజుల కిందటి సంగతి.. 18-పేజెస్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సాగుతుంది. అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారు. ఉన్నట్టుంది సడెన్ గా అల్లు అరవింద్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేతిని అందుకున్నాడు. ప్రేమగా దగ్గరకు లాక్కున్నారు. ఆమె అరచేతిని ముద్దాడారు.

ఆ వీడియో, దానికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా ఆ ఘటనపై అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. అల్లు అరవింద్ తనకు తండ్రితో సమానం అని వ్యాఖ్యానించింది .

అనుపమ కలిసిన ప్రతిసారి అల్లు అరవింద్ ఒకే మాట అంటారు. తనలాంటి కూతురు ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతుంటారట. ఆ పుత్రికా వాత్సల్యంతోనే ఆరోజు తన అరచేయిని ముద్దుపెట్టుకున్నారని, తనకు కూడా అరవింద్ తో మాట్లాడినప్పుడు తండ్రి తో మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చింది.

తాజాగా థియేటర్లలోకి వచ్చింది. 18 పేజెస్ సినిమా. సినిమాకు మరీ ఫ్లాప్ టాక్ రాలేదు. అలా అని సూపర్ హిట్ టాక్ కూడా రాలేదు. ఎన్ని రోజులు థియేటర్లలో నిలబడుతుందో చూడాలి.

First Published:  24 Dec 2022 3:40 PM GMT
Next Story