Telugu Global
Cinema & Entertainment

రెజీనా, అనుపమ లీడ్ రోల్స్ లో సినిమా!

అనుపమ పరమేశ్వరన్, రెజీనా కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దీనికి డిఫరెంట్ టైటిల్ పెట్టారు.

రెజీనా, అనుపమ లీడ్ రోల్స్ లో సినిమా!
X

బ్యూటిఫుల్ హీరోయిన్లు రెజీనా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తూ ఓ సినిమా చేస్తున్నారు. స‌తీష్ కాశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ చిత్రానికి 'మ‌రీచక' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. విజ‌య్ అశ్విన్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. 'మ‌రీచక' అంటే క‌ళ్ల‌ను క‌నిక‌ట్టు చేసే భ్ర‌మ అని అర్థం.

'మరీచక' సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే అందులో కేవ‌లం పాదాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఆ పాదాల ప్ర‌తిబింబం నీళ్ల‌లో ఓ అమ్మాయి నీడ‌లాగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్‌కు 'ప్రేమ ద్రోహం ప్ర‌తీకారం' అనేది క్యాప్షన్. ఈ పోస్ట‌ర్, టైటిల్ కాస్త క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి.

ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. జూలై 26 నుంచి రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ రొమాంటిక్ డ్రామాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వ‌న్ మోర్ హీరో బ్యాన‌ర్‌పై రాజీవ్ చిక్కాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌క్ష్మీ భూపాల ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, పాట‌ల‌ను అందించారు. అంతేకాదు, ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

20 ఏళ్ల పాటు యానిమేష‌న్ రంగంలో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుని ఛోటా భీమ్‌ను రూపొందించారు రాజీవ్ చిక్కా. ఇప్పుడు వ‌న్ మోర్ హీరో అనే బ్యాన‌ర్‌ను ప్రారంభించి, మరీచక సినిమా చేస్తున్నారు.




First Published:  15 July 2022 2:44 AM GMT
Next Story