Telugu Global
Cinema & Entertainment

Tillu Square: మళ్లీ తెరపైకి అనుపమ పేరు

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ ప్రాజెక్టు నుంచి తాజాగా అనుపమ పరమేశ్వరన్ తప్పుకుంది. ఇప్పుడు మరోసారి ఆమె పేరు తెరపైకొచ్చింది.

Tillu Square: మళ్లీ తెరపైకి అనుపమ పేరు
X

'డీజే టిల్లు' సీక్వెల్‌కి 'డీజే టిల్లు స్క్వేర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సినిమా టైటిల్ లాగే ఈ సినిమాలోని లీడింగ్ హీరోయిన్ విషయంలోనూ టీమ్ మళ్లీ మొదటికి వచ్చింది.

అనుపమ పరమేశ్వరన్‌తో మేకర్స్ రాజీకొచ్చినట్టు తెలుస్తోంది. ఆమెను తిరిగి తమ టీమ్‌లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారట. ఈ సినిమాకు సంబంధించి 10 రోజుల షూటింగ్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

ఆ తర్వాత చాలామంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మడొన్న సెబాస్టియన్ తో పాటు, "హిట్ 2" హీరోయిన్ మీనాక్షి చౌదరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

అయితే వీళ్లను పక్కనపెట్టి, మరోసారి అనుపమ పరమేశ్వరన్‌ని యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. ఆమె తిరిగి రావడానికి అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు. ఆయనే అన్నీతానై వ్యవహరిస్తున్నాడు. అనుపమ తప్పుకోవడానికి అతడే ప్రధాన కారణం అనే కథనం కూడా ఉంది. అయితే ఈసారి మాత్రం నిర్మాత నాగవంశీ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దినట్టు సమాచారం.

First Published:  21 Dec 2022 12:19 PM GMT
Next Story