Telugu Global
Cinema & Entertainment

Butterfly: నేరుగా ఓటీటీలోకి అనుపమ సినిమా

Anupama Parameswaran: అనుపమ నుంచి మరో సినిమా రాబోతోంది. అయితే ఈసారి అది నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

Butterfly: నేరుగా ఓటీటీలోకి అనుపమ సినిమా
X

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బటర్ ఫ్లై. ఈ సినిమాలో భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జెన్ నెక్ట్ మూవీస్ బ్యానర్ పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఘంటా సతీష్ బాబు దర్శకుడు.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రేపు (29న) డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అనుపమ కెరీర్ లో నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే. ఇందులో అనుపమ ఓ పాట కూడా పాడింది. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా.

గతేడాది డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. 30 రోజుల్లో టోటల్ షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఏడాది టైమ్ తీసుకుని క్వాలిటీగా చేశారు. ఈ చిత్రంలో గీత అనే పాత్రలో కనిపించనుంది అనుపమ. ఈ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

ఈ ఏడాది ఇప్పటికే కార్తికేయ 2తో బిగ్ హిట్ అందుకుంది అనుపమ. ఇక 18 పేజెస్ సినిమాతో యావరేజ్ సక్సెస్ కొట్టింది. ఇప్పుడు బట్టర్ ఫ్లై సినిమాతో మరో సక్సెస్ గ్యారెంటీ అంటోంది.

First Published:  28 Dec 2022 3:59 AM GMT
Next Story