Telugu Global
Cinema & Entertainment

హీరో రామ్ తో జాతిరత్నాలు డైరక్టర్

రామ్ పోతినేని, అనుదీప్ కేవీ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. త్వరలోనే ఈ హీరోకు నెరేషన్ ఇవ్వబోతున్నాడు ఈ జాతిరత్నాలు దర్శకుడు.

హీరో రామ్ తో జాతిరత్నాలు డైరక్టర్
X

దర్శకుడు అనుదీప్ తన నెక్ట్స్ మూవీ డీటెయిల్స్ బయటపెట్టాడు. ప్రిన్స్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కామెడీ చిత్రాల దర్శకుడు.. తన తదుపరి చిత్రాన్ని రామ్ పోతినేనితో తీసే అవకాశం ఉందని ప్రకటించాడు.

"కథలు ఉన్నాయి. హిందీలో కూడా ఒక సినిమా చేయాలని ఉంది. హీరో రామ్ గారికి ఒక కథ చెప్పాలి. త్వరలోనే నెరేషన్ ఇస్తాను. ఏ విషయం 15 రోజుల్లో చెబుతాను. రామ్ కు చెప్పాల్సిన కథ మొత్తం రెడీగా ఉంది."

ఇలా రామ్ కు కథ చెప్పబోతున్నట్టు ప్రకటించాడు అనుదీప్. సితార, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ కు చెందిన అడ్వాన్సులు ఈ దర్శకుడి వద్ద సలఉన్నాయి. రామ్ తో కథ ఓకే అయితే, ఈ రెండు బ్యానర్లలో ఒక బ్యానర్ పై ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది.

ప్రిన్స్ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్నాడు అనుదీప్. జాతిరత్నాలు టైపులో బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా.. ఫ్లాప్ అనే టాక్ మాత్రం రాలేదు ఈ సినిమాకి. ప్రస్తుతం టాలీవుడ్ లో కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు అనుదీప్.




First Published:  23 Oct 2022 7:45 AM GMT
Next Story